Wednesday, 13 November 2019

శ్రద్దేయ దత్తోపంత్ టెంగ్డే జి జన్మ శతాబ్ది ఉత్సవ సమితి-తెలంగాణా ఉద్ఘాటన సభ తేదీ 13 నవంబర్ 2019

శ్రద్దేయ దత్తోపంత్ టెంగ్డే జి జన్మ శతాబ్ది ఉత్సవ సమితి-తెలంగాణా ఉద్ఘాటన సభ తేదీ 13 నవంబర్ నాడు సికింద్రాబాద్ హరి హర కళా భవన్ లో జరిగింది. ఈ సభలో ఉత్సవ సమితి చైర్మన్ శ్రీ ఆర్ వి సుబ్బారావు గారు, వైస్ చైర్మన్ శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారు ఉద్ఘాటన చేశారు. BMS జాతీయ సంఘటనా కార్యదర్శి శ్రీ బి సురేంద్రన్ గారు, సామాజిక సమరసత వేదిక తెలంగాణా కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ గారు ముఖ్య వక్తలుగా విచ్చేసి శ్రీ దత్తోపంత్ జి జీవన ఆదర్శం , వ్యక్తిత్వం సభికులకు వివరించి మంచి స్ఫూర్తి దాయకమైన సందేశం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దత్తోపంత్ జి జీవిత విశేషాల ప్రత్యేక సంచిక ఆర్గనైసర్ , భారతీయ కిసాన్ సంఘ్ ఉభయ రాష్ట్రాల ప్రత్యేక సంచిక ఆవిష్కరించటం జరిగింది. మాజ్దూర్ సంఘ్ ,కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ మంచ్ రాష్ట్ర పదాధికారులు మరియు ఉత్సవ సమితి సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





2020 ఏప్రిల్ నెలలో హైదరాబాద్ లో జరగనున్న BMS జాతీయ మహాసభలు

2020 ఏప్రిల్ నెలలో హైదరాబాద్ లో జరగనున్న BMS జాతీయ మహాసభలకు ఒకరోజు వేతనం ఇవ్వాలన్న పిలుపు మేరకు ఈ రోజు BMS జాతీయ సంఘటనా కార్యదర్శి సురేంద్రన్ గారికి మొదటి విడతగా Rs.50000/-  అందచేసిన BPEA సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ పదాధికారులు బేగ్,లోకేష్ వెంకటేష్, విఠల్, జై చంద్, పి.లక్ష్మీనారాయణ తదితరులు కార్యక్రమంలో BMS సీనియర్ నాయకులు శ్రీ ఆర్ వి సుబ్బారావు గారు,BMS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బి. రవీంద్రరాజు వర్మ,ప్రధాన కార్యదర్శి రవిశంకర్,కోశాధికారి కె.వెంకటేశం పాల్గొన్నారు