Thursday 23 July 2020

SB Order 27/2020 - Extension of MIS/SCSS/KVP/NSC/PPF schemes upto GDS Branch Post Offices - reg

BPEA Telangana celebrates BMS Foundation day on 23-07-2020







👏 భారతీయ మజ్దూర్ సంఘ్ 👏.
                                దేశం కోసం పనిచేస్తాం, తగిన వేతనం సాధిస్తాం అనే నినాదం బి.యం.యస్. సొంతం. కార్మికులలో దేశం పట్ల అంకితభావం ఉన్నప్పుడు వారిలో దేశభక్తి నిర్మాణమవుతుంది. దేశం నిలిస్తే కార్మికులు నిలుస్తారు. దేశం పతన మైతే కార్మికులు నిలువలేరు. అందుకే కార్మికులలో దేశభక్తిని నింపి, వారిలో జాతీయతా భావాన్ని పెంపొందించి తద్వారా దేశానికి వారిని అంకితం చేయాలి.
                                1955 జులై23 మధ్యప్రదేశ్ లో, భూపాల్ నగరంలో ఆవిర్భవించిన భారతీయ మజ్దూర్ సఘ్, ఈ జులై 23నాటికి 65 సం.లు పూర్తిచేసుకుని 66సం.లోనికి అడుగిడుతున్నది. అనేక గుర్తింపు పరిశీలన, ప్రతి పది సంవత్సరముల కొకసారి జరుగును. ఇలా జరిగిన అనేక పరిశీలనలలో  మొదటి స్థానంలో నిలబడింది.
                            త్యాగం, తపస్సు మరియు బలిదానం పునాదిగా కార్యకర్తలు నిరంతర అవిరామ కృషితో కొన్ని నిర్దిష్టమైన,  విశేషమైన ప్రాధాన్యతలపై ఆధారపడి పురోగమించుట ద్వారా ప్రపంచ కార్మిక లోకాన్ని ఆశ్చర్యంలో ముంచివేసింది. కార్మికుల్లో దేశంపట్ల అంకితభావం ఉన్నప్పుడు మాత్రమే ఆదర్శం అమలవుతుందని గట్టిగా విశ్వసిస్తుంది. కార్మికులలో దెశభక్తిని నింపి జాతిపురోభివృధ్ధికి వారిని సిద్దంజేయడంలో బి.యం.యస్. తనవంతు పాత్ర పోషిస్తుంది.  కార్మికుల్లో స్వదేశి, స్వావలంబన, స్వాభిమానం నింపే ఉద్ధేశ్యంతో దత్తోపంత్ ఠ్ంగ్డీజీ బి.యం.యస్. ను ప్రారంభించినారు.
           ఈ పరిశ్రమ నాది అనుకున్నప్పుడు మాత్రమే కార్మికుడు కష్టించి పనిచేస్తాడు.అందుకే కార్మికులను పరిశ్రమల్లో భాగస్వాములుగా చేయాలని బి.యం.యస్. కోరుతోంది. దేశం పారిశ్రామికీకరణ కాకుండా సంపన్నవంతం కాలేదు. అలాగే కార్మికులకు కొనుగోలు శక్తి లేక తమ అవసరాలను కూడా తీర్చుకొనలేరు. ఫలితంగా దేశంలో దారిద్ర్యం తాండవిస్తుంది. దేశం తనకాళ్ళపై తాను నిలువలేదు. ఇతరుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి, స్వావలంబన లేక అన్నివిధాలా పతనమవుతుంది. అందుకే దేశం శక్తివంతం కావాలంటే పారిశ్రామికీకరణ జరగాలి.
                ప్రజలందరికీ పనిచూపగల సమర్ధవంతమైన పరిశ్రమలతో దేశాన్ని సుసంపన్నం చేయాలి. మనదేశ అవసరాలు తీర్చగల స్వదేశీ సాంకేతికను సంపూర్ణంగా వినియోగం లోనికి తేవటం ద్వారా అత్యధిక సంఖ్యాకులు తో అధికోత్పత్తిని సాధించాలనేది బి.యం.యస్ విధానం..

సమిష్టి నాయకత్వం: బి.యం.యస్. లో ప్రతినిర్ణయమూ అందరితో చర్చింపబడి, ఆమోదయోగ్యమైన రీతిలో నిర్ణయాలు చేయబడి అమలుపరచబడుతుంది. బలవంతంగా రుద్దే నిరంకుశ విధానం బియంయస్ లో అనుసరించ బడదు. సమిష్టి నిర్ణయం ద్వారా సమిష్టి నాయకత్వం కొనసాగుతుంది.
కార్యకర్తలు గుణము: ఒకే ఆశయం ఆదర్శాలుతో ప్రేరితులైన కార్యకర్తల సమూహం ఒకే ధ్యేయ మార్గంలో పయనిస్తు, సమూహ శక్తి సామర్ధ్యాలను శక్తివంతమైన సంఘటనా నిర్మాణానికి వినియోగ పరచగల సుశిక్షితమూ, ధ్యేయపూర్ణమైన కార్యకర్తల గణము బియంయస్ కు ఆధారం.
పారదర్శకత: దాపరికం లేని ప్రవర్తన. ఏది ఆలోచిస్తామో దానినే చెప్పటం, ఏమి చేస్తున్నమో అదేచేసి చూపటం, చెప్పుటకు చేయుటకూ ఏవిధమైన తేడాలేని మరియు దాపరికం లేని ఆచరణమే బియంయస్ విశిష్టత. త్యాగము,తపస్సు, బలిదానము:  బియంయస్ యనిర్మాణము, విస్తరణ మరియు శక్తి నిజాయితీగలిగిన కార్యకర్తలు నిస్వార్థ సేవాభావంపై ఆధారపడి ఉన్నది. కార్యకర్తలు తమ వ్యక్తిగత ఆకాంక్షతో బాటు తమ సర్వస్వాన్ని త్యాగం చేస్తూ ఆజన్మాంతం ఈ సంఘటనా కార్యాన్ని అంకితభావంతో తపస్సులాగా కొనసాగిస్తు, అవసర మైనపుడు తమ జీవితాలను బలిదానం చేయగల ధ్యేయనిష్ఠగల  కార్యకర్తలు పరంపరలపై బియంయస్ పురోగమిస్తుంది.
రాజకీయాలకతీతమైంది: బియంయస్ కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం కాని, అనుబంధం గాని లేదు. రాజకీయాలకతీతంగా కార్మికుల కొరకు,  కార్మికులచేత, కార్మికులే నడుపుకుంటున్న ఏకైక వాస్తవిక కార్మిక సంఘటన. మొదట బియంయస్, తర్వాతే యూనియన్. ఏయూనియన్ లో సభ్యుడిగా చేరిన కార్మికుడైనా మొదటి బియంయస్ కు, తర్వాత తన యూనియన్ కు ప్రాధాన్యత ఇస్తాడు.
ఆర్దిక అనుశాసనముBMS లో జమచేయబడే ప్రతి పైసాకు రశీదు ఇవ్వబడుతుంది. జమ చేయబడే డబ్బు బ్యాక్ లో సంస్థ పేరుతో జమ చేయబడుతుంది.  ఆ తర్వాత సంవత్సరాంతంలో రూపొందించిన ఆదాయ, వ్యయ పట్టిక ద్వారా మహాసభలో చర్చింపబడి ఆమోదించి బడుతుంది.
ప్రాధాన్యతా శ్రేణి: బియంయస్ కు మొదట దేశం క్షేమం, తర్వాత రెండోస్తానం పరిశ్రమ క్షేమం, తృతీయ స్థానం కార్మిక క్షేమానికిస్తుంది. అలా బలోపేతమైన దేశంలో మాత్రమే కార్మికులకు సంపూర్ణ సంక్షేమం లభిస్తుందన్నది
Bms విశ్వాసం.
శ్రమసంఘటన విధానంలో విశ్వాసం: హింస, దౌర్జన్యం రక్తపాతం మరియు మన దేశానికి సరిపోని విదేశీ సిద్ధాంతం మౌఢ్యంతో కార్మికులను తప్పుదారి పట్టించి పరిశ్రమలను మూతవేయించి, తద్వారా పారిశ్రామిక అశాంతికి దారితీసే జాతీయ వ్యతిరేక పద్ధతులకు బియంయస్ లో తావులేదు.
బాధ్యతాయుత సహకారం: బియంయస్ కు రాజకీయాలతో సంబంధంలేదు. ప్రజామోదం పొందిన ఏరాజకీయ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కాని,కార్మికుల పట్ల అనుకూల విధానాన్ని అనుసరించే ప్రభుత్వానికి మాత్రమే తన బాధ్యతాయుత సహకార విధానాన్ని కొనసాగిస్తుంది.
హక్కులు,భాద్యతలుబియంయస్ కేవలం హక్కులను మాత్రమే ఇవ్వదు. బాధ్యతలకు కూడా అత్యంత ప్రాధాన్యత నిస్తుంది. బాధ్యతలను గుర్తెరిగిన బాద్యతాయుత జాతీయ కార్మికులుగా, కార్మికులను తీర్చి దిద్దుతుంది.